కడప,కర్నూలు,అనంతపురం జిల్లాల సరిహద్దులో ఉన్న సైరా జలపాతం కనువిందు చేస్తోంది.చిరంజీని నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పాత్రధారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గతంలో ఇదే అడవిలో జలపాతాల మాటున బ్రిటిష్ వారికి కనిపించకుండా నెలరోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నట్లు చెబుతారు.అవుకు రాజు ఆశ్రయంతో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఇదే ప్రాంతంలో తలదాచుకోవటం వల్ల ఈ జలపాతానికి సైరా జలపాతం పిలుస్తుంటారు.ఈ మార్గంలో కనిపించే పెద్దమ్మ ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.కొండల పైనుంచి జలపాతం జాలువారుతున్న దశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.ఈ జలపాతానికి చూసేందుకు వచ్చిన విద్యార్ధులు జలపాతం సవ్వడులను కనులారా వీక్షించి నీటిలో తడిసి ముద్దయ్యారు.
సైరా జలపాతంను చూశారా..! - latest news in saira waterflow
'సైరా నరసింహారెడ్డి..' వెండితెర ప్రియులకు వినోదం పంచిన సినిమా ఇది. సైరా పేరు వినగానే ఓళ్లు పులకరిస్తోంది. తాజాగా..సైరా జలపాతం వెలుగులోకివచ్చింది. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలతో కడప, కర్నూలు , అనంతపురం జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ సైరా జలపాతం పర్యాటకుల మదిని దోస్తోంది. ఈ సైరా జలపాతం కథ, కమీషూ ఎంటో చూడాలంటే..ఈ కధనం చూడాల్సిందే..!
సైరా జలపాతం..అందరీని కనువిందు చేస్తోంది