కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... రాజంపేట జిల్లా సాధన సమితి పేరిట రిలే నిరాహార దీక్షను చేపట్టారు. రాజంపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. రాజకీయాలతీతంగా ప్రతి ఒక్కరూ రాజంపేటను జిల్లాగా సాధించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలని సాధన సమితి చైర్మన్ ఎస్.ఎస్. పంత్ కోరారు. ఇప్పటికే ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా చేస్తామని సీఎం హామీ ఇచ్చారని... అయినా తమ మనోభావాలను మరింత గట్టిగా చెప్పేందుకు ఈ దీక్షను చేపడుతున్నామని సమితి సభ్యులు తెలిపారు.
రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని రిలే నిరాహార దీక్ష - రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని నిరాహార దీక్ష
కడప జిల్లా రాజంపేట పార్లమెంటు కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించాలని... రాజంపేట జిల్లా సాధన సమితి పేరిట రిలే నిరాహార దీక్షను చేపట్టారు.

రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని రిలే నిరాహార దీక్ష
TAGGED:
rajampeta latest news