Sadar celebrations in Ramantapur: హైదరాబాద్ నగరంలో యాదవ సోదరుల సదర్ వేడుకలు సందడిగా ప్రారంభం అయ్యాయి. రామంతాపూర్‌లో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, సుభాష్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు పాల్గొని.. నృత్యాలు చేశారు. నార్సింగ్‌లోనూ సదర్ ఉత్సవాలు హోరెత్తించాయి.
భాగ్యనగరంలో సందడిగా సదర్ వేడుకలు.. ఎమ్మెల్యేల డ్యాన్స్ అదుర్స్ - హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు
Sadar celebrations in Ramantapur: హైదరాబాద్ నగరంలో మరో ఉత్సవం ప్రారంభమైంది. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకొని మరుసటి రోజు ఏటా యాదవ సోదరులు నిర్వహించే సదర్ వేడుకలు రామాంతాపూర్లో ఘనంగా ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, సుభాష్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సదర్ ఉత్సవాలకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి తెచ్చే వివిధ రకాలు దున్నపోతులను ప్రదర్శించి.. వాటితో ప్రత్యేక వినోద కార్యక్రమాలు చేయడం ఆనవాయితి.
సదర్ వేడుకలు
దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. ఉత్సవాలను ప్రారంభించారు. హాకీ స్టిక్‌లను చేత పట్టి తీన్మార్ స్టెప్పులతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. హుషారు తెప్పించారు. ఆల్ ఇండియా ఛాపింయన్ దున్నపోతు.. చాంద్ వీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇవీ చదవండి: