ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి'

త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఎన్​సీసీ అధికారిణి మోహనవల్లి.. కేంద్రాన్ని కోరారు. రాజంపేట డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ ఆధ్వర్యంలో 50 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

ryali with national flag
రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వార్తలు

By

Published : Mar 31, 2021, 4:36 PM IST

జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారిణి మోహనవల్లి కోరారు. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ, ఎన్ఎస్ఎస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు.. 50 మీటర్ల జాతీయ పతాకంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

కళాశాల నుంచి పాత బస్టాండ్ వరకు 'వందేమాతరం వందేళ్ల పతాకం' అనే నినాదంతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.ఎన్​సీసీ అధికారులు మేజర్ విజయ్ భాస్కర్, చక్రధర్ రాజు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details