రాష్ట్ర వ్యాప్తంగా 130 మండలాల్లో ప్రయోగాత్మకంగా కిసాన్ రాజా విధానాన్ని చేపట్టినట్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీరింగ్ చీఫ్ ఆర్ వి కృష్ణారెడ్డి తెలిపారు. వీటిని గ్రామ సచివాలయాలకు అనుసంధానించి తాగునీటి పథకాల ఆన్, ఆఫ్ ను చరవాణి ద్వారా చేయనున్నామన్నారు.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని అట్లూరు మండలం లోని గ్రామ సచివాలయం నూతన భవనం పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని సిబ్బందిని అభినందించారు.