ఆర్టీసీ బస్టాండుల్లో ఎమ్మార్పీపై ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని కడప ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన.. అధికారులకు పలు సూచనలు చేశారు. టికెట్ల రిజర్వేషన్ కోసం ప్రయాణికుల నుంచి 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఛైర్మన్ దృష్టికి రాగా ఇలాంటివి ఆపాలని ఆదేశించారు. ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలకు నోటీసులు జారీ చేయాలన్నారు. భోజనశాలలు పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని యజమానులకు సూచించారు.
ఎమ్పార్పీకి వస్తువులు విక్రయించకుంటే చర్యలు - searching
ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మార్పీకే వస్తువులను విక్రయించాలని కడప ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బస్టాండ్లో జోనల్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు.

తనిఖీలు
బస్టాండ్లో ఎమ్మార్పీకే వస్తువులు విక్రయించాలి
ఇది కూడా చదవండి.