ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం కల్పించాలి'

కడపలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. అర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ అన్నారు.

rtc-union-meeting
ఆర్టీసీ ఎంప్లాయిస్ కి పింఛన్ సౌకర్యం కల్పించాలి

By

Published : Dec 30, 2019, 5:40 PM IST

ఆర్టీసీ ఎంప్లాయిస్ కి పింఛన్ సౌకర్యం కల్పించాలి

పింఛన్ లేని ఆర్టీసీ విలీనం వృథా అని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ అన్నారు. కడపలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని ఆయన పేర్కొన్నారు. మనం ఏళ్ల తరబడి విలీనం కోరుకున్నది పింఛన్ కోసమేనని ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వం పింఛన్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పింఛన్ లేకపోతే పదవి విరమణ పొందిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికులకు పింఛన్​ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details