ప్రయోజనాలు లేని ఆర్టీసీ విలీనం వద్దంటూ కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. రద్దు చేసిన సౌకర్యాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ నాయకులు కుమార్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రద్దు చేసిన ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ పథకాలు తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. పరిమితి లేని వైద్యం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక నాయకులంతా, ఏకతాటిపైకి వచ్చి సమస్యలపై పోరాడాలని.. లేకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందని సూచించారు.
సమస్యలు పరిష్కరించాలని కడపలో ఆర్టీసీ కార్మికుల ధర్నా - కడపలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల రిలే నిరాహార దీక్షలు
ఆర్టీసీ విలీనం వద్దంటూ కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పరిమితి లేని వైద్యం కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
![సమస్యలు పరిష్కరించాలని కడపలో ఆర్టీసీ కార్మికుల ధర్నా rtc union leaders agitationc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6035124-116-6035124-1581415144102.jpg)
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల రిలే నిరాహార దీక్షలు
సమస్య పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఆందోళన