పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.8వేలు ఇవ్వాలని ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం కార్యదర్శి రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు కోరుతూ కడప జిల్లా అంబేడ్కర్ కూడలి వద్ద రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు ప్రస్తుతం వెయ్యి నుంచి మూడు వేల వరకు మాత్రమే పింఛను వస్తుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం... తమను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ పెంచాలని కోరారు.
పెన్షన్ పెంచాలని కోరుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా - dharna in kadapa district latest news
కడపలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 8వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![పెన్షన్ పెంచాలని కోరుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా rtc retired employees dharna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10112014-847-10112014-1609749336268.jpg)
ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా