కడప జిల్లా పులివెందుల ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాగూర్ పరిశీలించారు. నూతనంగా నిర్మించనున్న డిపో.. రోల్ మోడల్‌గా నిలవాలని ఠాగూర్ పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మించే.. బస్టాండ్‌కు సంబంధించి పూర్తి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పులివెందుల ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ - పులివెందుల ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ న్యూస్
కడప జిల్లా పులివెందులలో నూతనంగా నిర్మించనున్న ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాగూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మించనున్న బస్టాండ్‌కు సంబంధించి పూర్తి వివరాలను.. సిబ్బందిని అడిగి ఠాగూర్ తెలుసుకున్నారు.

పులివెందుల ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ
ఈ సందర్భంగా పలువురు ఆర్టీసీ సిబ్బంది.. తమ సమస్యలను ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కడప రీజినల్ మేనేజర్, పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.