కార్మిక సమస్యలపై సోమవారం ముఖ్యమంత్రి జగన్ని కలవనున్నట్టు ఆర్టీసీ ఐకాస నేతల నరసయ్య తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించకుంటే 13 నుంచి సమ్మె తప్పదని కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో లో జరిగిన సమ్మె సన్నాహక బహిరంగ సభలో చెప్పారు. ఆర్టీసీలో కార్మికులను కుదించే విధానాన్ని రద్దు చేయాలన్నారు. అద్దె బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అని కోరారు. కార్మికులకు 60 ఏళ్ల వయోపరిమితి పెంచాలని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటిపై యాజమాన్యం స్పందించకుంటే సమ్మె తథ్యమని హెచ్చరించారు.
సమ్మె నోటీసులోని సమస్యలన్నీ పరిష్కరించాలి - government
సమ్మె నోటీసులోని సమస్యలన్నింటినీ పరిష్కరించకుంటే ఈనెల 13వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ ఐకాస నేతలు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ