కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సంస్థకు నష్టాలు వస్తున్నాయని.. యానియన్ డిపో కార్యదర్శి శేఖర్ ఆరోపించారు. ప్రైవేటు వాహనాలను అరికట్టటంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కార్మికులపై పనిభారాన్ని పెంచి మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. కార్మికులకు అవసరమైనపుడు సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ యాజమాన్యానికి నోటీసు ఇచ్చామన్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంస్థకు నష్టాలు - kadapa
రాజంపేట ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ