ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా.. విధివిధానాలే ప్రకటించలేదు' - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా.. ఇప్పటివరకూ విధివిధానాలు ప్రకటించలేదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని వారు ఆరోపించారు.

rtc employees
rtc employees

By

Published : Apr 2, 2021, 2:04 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారే తప్ప ఇప్పటివరకు విధివిధానాలను ప్రకటించకపోవడం దారుణమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వైవీ.రావు, దామోదరరావు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వీటిని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత కోసం మాత్రమే విలీనం చేశారని మిగిలిన సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనం అయినప్పటికీ తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని.. అవసరమైతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ విధివిధానాలను ప్రకటించాలని.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఆస్పత్రిలో చేరిన సచిన్​ తెందూల్కర్​

ABOUT THE AUTHOR

...view details