ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంపై కడప జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మిక సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి వీరంతా కేకు కోశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో రాజకీయాలకతీతంగా ప్రతీ కార్మికుడు జగన్కు అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో కార్మికులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ, వైకాపా నాయకుడు పోలా శ్రీనివాసరెడ్డి, కార్మిక సంఘాల నాయకులు, వైకాపా నేతలు పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కార్మికుల సంబరాలు - kadapa latest news for rtc members
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంపై కడప జిల్లా రాజంపేటలో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, డిపో మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
కడపలో ఆర్టీసీ కార్మికుల సంబరాలు..