ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవింగ్ పాఠశాలలో యువతకు శిక్షణ - కడప జిల్లాలో ఆర్టీసీ డ్రైవింగ్ పాఠశాల

కడప జిల్లాలో యువతకు ఆర్టీసీ సంస్థ డ్రైవింగ్ పాఠశాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులు కూడా ఎంతో ఉత్సాహంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడితే..మొదటి ప్రాధాన్య వీరికే ఇవ్వనున్నారు.

RTC Driving School at kadapa
కడప జిల్లాలో ఆర్టీసీ డ్రైవింగ్ పాఠశాల

By

Published : Aug 28, 2020, 11:10 PM IST


ఆర్టీసీ సంస్థ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు కార్గో ద్వారా వస్తువులను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అర్హత కలిగిన యువతకు ఆర్టీసీ సంస్థ డ్రైవింగ్ పాఠశాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడితే... డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ పొందిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కడపలో ఏర్పాటుచేసిన డ్రైవింగ్ స్కూల్ ఎంతో విజయవంతంగా నడుస్తోంది.

ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయాణికులను సామాగ్రిని చేర్చడంతో పాటు కొత్తగా డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలను ప్రారంభించారు. అందులో భాగంగా కడప జిల్లాలో కడప, రాజంపేట ప్రాంతాలలో డ్రైవింగ్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఒక బ్యాచ్​కు 16 మంది చొప్పున 32 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. 15 రోజులు థియరీ, 15 రోజులు ప్రాక్టికల్ ఉంటుంది. ఒక్కో అభ్యర్థి నుంచి 15 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. 32 సంవత్సరాల అనుభవం ఉన్న ఆర్టీసీ డ్రైవర్లతో అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. పూర్తిస్థాయిలో అభ్యర్థులను తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు. అభ్యర్థులు కూడా ఎంతో ఉత్సాహంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. డ్రైవింగ్ లో పాటించాల్సిన మెళకువలు, సూచనలు అన్నింటినీ నిర్వాహకులు వారికి విశదీకరిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం మంచిగా శిక్షణ ఇస్తున్నారని... అభ్యర్థులు తెలిపారు.

ప్రస్తుతం మొదటి బ్యాచ్ అభ్యర్థులకే శిక్షణ ఇస్తున్నామని... త్వరలో రెండో బ్యాచ్ కూడా ప్రారంభమవుతుందని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం భాస్కర్ తెలిపారు. అభ్యర్థులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నామని.. వారు కూడా ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారని అన్నారు.

ఇదీ చూడండి.'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details