గుట్టుచప్పుడుగా సాగుతున్న గుట్కా వ్యాపారాన్ని పోలీసులు రట్టు చేశారు. రాజంపేట మండలం బోయనపల్లికి చెందిన శివ నారాయణ, ఆర్టీసీ డ్రైవరు చెన్నయ్య కలిసి గుట్కా వ్యాపారం సాగిస్తూ పట్టుబడ్డారని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. పట్టుబడిన సుమారు రూ.3 లక్షలు విలువ చేసే గుట్కాతోపాటు నిందితులను ఆదివారం మీడియాకు చూపారు.
ఆర్టీసీ డ్రైవర్ గుట్కా వ్యాపారం... పోలీసులకు చిక్కిన వైనం - kadapa latest news
ఆర్టీసీ డ్రైవర్, మరో వ్యక్తి కలిసి సాగించిన గుట్కా వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట మండలంలో చోటుచేసుకుంది.
![ఆర్టీసీ డ్రైవర్ గుట్కా వ్యాపారం... పోలీసులకు చిక్కిన వైనం RTC Driver Gutka Business in kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8876505-58-8876505-1600654723338.jpg)
బోయనపల్లికి చెందిన శివనారాయణ గుట్కా వ్యాపారం చేసేవాడని... అక్రమార్జనకు ఆశపడి ఆర్టీసీ డ్రైవరు చెన్నయ్య అతనితో చేతులు కలిసి బెంగళూరు నుంచి లగేజీ మాటున గుట్కా తెచ్చి విక్రయించేవారని డీఎస్పీ తెలిపారు. ఈక్రమంలో శనివారం బెంగళూరు నుంచి బస్సులో వచ్చిన గుట్కా, ఆర్టీసీ డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఆదివారం శివనారాయణతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ షేక్ రోషన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:విషాదం..బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి