ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 19, 2023, 7:59 PM IST

ETV Bharat / state

ఆర్టీసీ కార్గో సేవల్లో దూసుకుపోతున్న కడప జిల్లా...

RTC cargo services: కార్గో సేవల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంలో కడప ఆర్టీసీ ముందంజలో ఉంది. గడిచిన ఏడాది కాలానికి సంబంధించి 10 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. 8 కోట్ల 49 లక్షల లక్ష్యాన్ని సాధించింది. రోజుకు సుమారు మూడు లక్షల మేరకు ఆదాయం గడిస్తోంది.

RTC cargo services
కార్గో సేవలు

RTC cargo services in AP: ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే కాకుండా.. సామగ్రిని సైతం సురక్షితంగా బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చుతూ.. ఆదాయాన్ని పెంచుకోవడంలో ఆర్టీసీ ముందంజలో ఉంది. కడప జోన్ వ్యాప్తంగా 8 జిల్లాల పరిధిలో కడప జిల్లా కార్గో ఆదాయంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గడిచిన ఏడాది కాలానికి సంబంధించి 10 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దెశించుకోగా.. 8 కోట్ల 49 లక్షల లక్ష్యాన్ని సాధించింది. రోజుకు సుమారు మూడు లక్షల మేరకు ఆదాయం గడిస్తోంది.

జిల్లాల విభజన అనంతరం ఆర్టీసీ కూడా రూపాంతరం చెందింది. ఒకప్పుడు కడప జోన్ కిందికి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉండేవి. ఇప్పుడు తిరుపతి, చిత్తూర్ అనంతపురం, కడప, నంద్యాలు, కర్నూల్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో పాటు డిపోలో 2016 నుంచి ఆర్టీసీ కార్గో సేవలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఒకప్పుడు కేవలం ప్రయాణికుల ద్వారా మాత్రమే ఆదాయం గడించేది. కానీ, ఆదాయాన్ని పెంచుకునేందుకు సామాగ్రిని, కార్గో ద్వారా బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. కడప జిల్లాలోని ఆరు డిపోల నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు కూడా సామాగ్రిని సురక్షితంగా చేరవేస్తున్నారు.

మొదట్లో కాస్త వెనుకబడినప్పటికీ ప్రస్తుతము ఆదాయం పెంచుకోవడంలో ముందంజలో ఉన్నారు. చిన్నపాటి కవర్ మొదలుకొని పెద్దపెద్ద వస్తువులను సైతం బస్సుల్లో, డీజీటీలలో తరలిస్తూ ఆర్టీసి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కడప ఆర్టీసీ కార్గో కార్యాలయము ఎప్పుడు ప్రజలతో కిక్కిరిసి ఉంటుంది. బుకింగ్ చేసుకునే వారితో పాటు వచ్చిన సామాగ్రిని తీసుకెళ్లే వారితో కార్యాలయం కిటకిటలాడుతోంది. కొన్ని గంటల వ్యవధిలో, ఒకరోజు వ్యవధిలోనే సామాగ్రిని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. దీంతో ప్రజలకు కార్గో పై మరింత నమ్మకం పెరుగుతోంది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా ఆర్టీసీ సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతోంది. పైగా వస్తువులకు భద్రత కూడా ఉంటుంది. మార్గమధ్యంలో వస్తువులు దెబ్బతింటే వాటికి అయ్యే ఖరీదు ఆర్టీసీ వారే చెల్లిస్తున్నారు. రోజుకు కొన్ని వందల టన్నుల కొద్ది సామాగ్రిని బస్సుల్లో తరలిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలతో పోల్చితే ఖరీదు కూడా తక్కువ సకాలంలో గమ్యస్థానాలకు వస్తువులను తీసుకెళ్తున్నారని ప్రజలు అంటున్నారు.

'కడప జోన్ లోని ఎనిమిది జిల్లాల్లో కెల్లా కడప జిల్లా కార్గో ఆదాయంలో ముందంజలో ఉంది. అనంతపురం 8 కోట్ల 84 లక్షలు, తిరుపతి 6 కోట్ల 85 లక్షల ఆదాయం, కడప జిల్లా 8 కోట్ల 89 లక్షల ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నాయి. 32 నిషేధిత సామాగ్రి తప్ప మిగిలిన సామాగ్రి అన్నింటిని ఆర్టీసీ బస్సుల్లో, డీజిటీలలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం వలన కార్గో ఆదాయం పెరిగింది.'-గోపాల్ రెడ్డి, కడప జిల్లా ఆర్టీసి అధికారి

ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఇంకా కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని కూడా సరిదిద్దుకొని రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి వచ్చేందుకు కడప జిల్లా ఆర్టీసీ అధికారులు కృషి చేస్తున్నారు.

ఆర్టీసీ కార్గో సేవల్లో దూసుకుపోతున్న కడప జిల్లా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details