ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో రోడ్డెక్కిన బస్సులు

లాక్ డౌన్ అనంతరం కడప జిల్లాలో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకుని బస్సులు నడుపుతున్నారు. మొత్తం 140 సర్వీసులు మొదటిరోజు నడిచాయి.

By

Published : May 21, 2020, 12:23 PM IST

Updated : May 21, 2020, 12:53 PM IST

rtc buses started in kadapa district after lockdown
కడప జిల్లాలో ప్రారంభమైన బస్సు సర్వీసులు

సుదీర్ఘ లాక్ డౌన్ అనంతరం 57 రోజుల తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కడప జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో 140 బస్సు సర్వీసులను ప్రారంభించారు. కండక్టర్లు లేకుండా గ్రౌండ్ బుకింగ్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు ఇచ్చారు. ప్రయాణికుడి పేరు, ఫోన్ నెంబర్, చిరునామా తదితర వివరాలు సేకరించి తర్వాత బస్సు ఎక్కిస్తున్నారు. మాస్కులు ఉన్నవారిని మాత్రమే బస్సులలోకి అనుమతిస్తున్నారు.

బస్టాండ్ ఆవరణలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఒక బస్టాండ్​లో ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత మరొక స్టేషన్​లో మాత్రమే దించుతున్నారు. మధ్యలో ఎక్కడా బస్సు ఆపడంలేదు. మాస్కులు కలిగి ఉన్నవారికి మాత్రమే బస్సు ఎక్కిస్తున్నారు.

ఇవీ చదవండి.. 'ఇందుకేనా అధికారంలోకి వచ్చింది?'

Last Updated : May 21, 2020, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details