ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 18 నుంచి రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్న ఆర్టీసీ - ఏపీఎస్​ఆర్టీసీ తాజా వార్తలు

ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీ సంస్థకు లాక్​డౌన్ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కడప జిల్లాలో గత 53 రోజులుగా బస్ సర్వీసులు నిలిపేశారు. ఈ నెల 17తో లాక్​డౌన్ గడువు ముగియనుండటంతో 18 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా.. సీట్ల సర్దుబాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

rtc bus services
rtc bus services

By

Published : May 15, 2020, 1:19 PM IST

కడప జిల్లాలోని అన్ని డిపోలు కలుపుకొని నెలకు సుమారు రూ 30 కోట్లు పైబడి రాబడి వచ్చేది. లాక్ డౌన్​తో సుమారు రూ 60 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. కడప డిపో నుంచి నెలకు రూ 6 కోట్ల పైబడి ఆదాయం రాగా రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్, రాజంపేట మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. నిత్యం ఆర్టీసీ బస్సుల రద్దీతో ఉండే రహదారులు నేడు బోసిపోయాయి. గత మార్చి 22వ తేదీ నుంచి బస్సు సర్వీసులను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు. ఇప్పటికే కోట్లలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద దెబ్బ అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈనెల 17తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుండటంతో 18వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. రెండు రోజులుగా డిపోల అధికారులతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. బస్సులు రహదారిపైకి వచ్చేముందు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కండక్టర్, నగదు రహితంగా ప్రజారవాణ చేయనున్నారు. గ్రౌండ్ బుకింగ్ ద్వారా టిక్కెట్ వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. బస్సులలో భౌతిక దూరం పాటించేలా.. సీట్ల సర్దుబాటు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. బస్సు సిబ్బందితో పాటు ప్రయాణికులు.. కరోనా నివారణ చర్యలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సరికొత్త ఆలోచన

ABOUT THE AUTHOR

...view details