ఆంధ్రప్రదేశ్‌లో 52 రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ పనుల కోసం కేంద్ర రహదారి రవాణాశాఖ 2021-22 బడ్జెట్‌లో రూ.2,200 కోట్లు కేటాయించింది. పామర్రు-ఆకివీడు సెక్షన్‌లో 64 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్ 165 విస్తరణ కోసం గరిష్ఠంగా రూ.200 కోట్లు కేటాయించారు. ఈ మార్గాన్ని పూర్తి ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు. కదిరి పట్టణానికి బైపాస్, రాయపుర్-విశాఖపట్నం మధ్య ఎన్‌హెచ్-26 విస్తరణ, మడకశిర నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న రహదారి విస్తరణ పనులకు మాత్రమే రూ.100 కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులకు రూ.2,200 కోట్లు - రహదారి ప్రాజెక్టులకు రూ.2,200 కోట్ల వార్తలు
రాష్ట్రంలో 52 రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ పనుల కోసం కేంద్ర రహదారి రవాణాశాఖ 2021-22 బడ్జెట్‌లో రూ.2,200 కోట్లు కేటాయించింది.
మిగిలిన పనులన్నింటికీ రూ.100 కోట్లలోపే కేటాయింపులు జరిగాయి. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ఆరు ప్రాజెక్టుల కోసం రూ.998 కోట్లు కేటాయించారు. ఇందులో కొయ్యూరు-ఛప్రతిపాలెం మధ్య 45 కిలోమీటర్ల విస్తరణకోసం రూ.206 కోట్లు, ఛప్రతిపాలెం నుంచి లంబసింగి వరకూ 40 కిలోమీటర్ల విస్తరణ కోసం రూ.183 కోట్లు, లంబసింగి-పాడేరు మధ్య 48 కిలోమీటర్ల విస్తరణకోసం రూ.213 కోట్లు, పాడేరు-గోండిగూడ సెక్షన్ విస్తరణకోసం రూ.127 కోట్లు, గోండిగూడ-అరకు సెక్షన్ విస్తరణకు రూ.171 కోట్లు కేటాయించారు.