ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘రౌండ్‌ ట్రిప్‌ ట్రాఫిక్‌’ రైల్వే సరకు రవాణా ప్రారంభం - రౌండ్‌ ట్రిప్‌ ట్రాఫిక్ వార్తలు కడప

దక్షిణ మధ్య రైల్వే నూతనంగా ప్రవేశపెట్టిన ‘రౌండ్‌ ట్రిప్‌ ట్రాఫిక్‌’ పథకాన్ని మొదటిసారి కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి ప్రారంభించారు. రౌండ్‌ ట్రాఫిక్‌ పద్ధతి ద్వారా రైల్వేకు, సరకు రవాణా వినియోగదారులకు ఇద్దరికి ప్రయోజనం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

round trip traffic
round trip traffic

By

Published : Jul 8, 2020, 9:34 AM IST

దక్షిణ మధ్య రైల్వే నూతనంగా ప్రవేశపెట్టిన ‘రౌండ్‌ ట్రిప్‌ ట్రాఫిక్‌’ పథకాన్ని మొదటిసారి కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి ప్రారంభించారు. ఎర్రగుంట్లలోని భారతీ సిమెంట్‌ కంపెనీ కృష్ణపట్నం పోర్టు(శ్రీలంకకు ఎగుమతి కోసం)కి క్లింకర్‌ని లోడ్‌ చేసింది. అలాగే తిరుగు ప్రయాణంలో కృష్ణపట్నం పోర్టు నుంచి ఎర్రగుంట్ల భారతీ సిమెంట్స్‌ కోసం పెట్‌కోక్‌ని దిగుమతి చేసుకుంది.

రౌండ్‌ ట్రాఫిక్‌ పద్ధతి ద్వారా రైల్వేకు, సరకు రవాణా వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో వినూత్న ఆలోచన ప్రవేశపెట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ప్రకటనలో పేర్కొన్నారు. నూతన విధానం ద్వారా వినియోగదారునికి రూ.8.7 లక్షల లాభం, రైల్వేకి రూ.5 లక్షల ఆదాయం చేకూరిందని వివరించారు. ఇందుకు కృషి చేసిన గుంతకల్లు డివిజన్‌ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి:బ్యాగు మోత తగ్గించే బోధన

ABOUT THE AUTHOR

...view details