రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపనుందని.. అఖిలపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రజలపై అధిక పన్నుల విధానాన్ని ఖండిస్తూ కడప ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష పార్టీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి, నీటి, మురుగు... వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేయనుందని పేర్కొన్నారు. మూడేళ్ల కాలంలో.. 30 వేల కోట్ల రూపాయల పన్నుల భారం పడనున్నదని తెలిపారు. పెట్రోల్ ధరలు పెరగటం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అధిక పన్నులపై పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే అన్ని రకాల ధరలను పెంచారని ఆరోపించారు.
పన్నులకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం - పన్నులకు వ్యతిరేకంగా కడప ప్రెస్ క్లబ్లో అకిలపక్ష పార్టీల సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపటానికి సిద్ధం అవుతోందని.. అఖిలపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి, నీటి, మురుగు.. వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేయనుందని పేర్కొన్నారు.
పన్నులకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం