కడప నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల భూకబ్జాలు ఎక్కువయ్యాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. భూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కడప ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. చివరకు పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
'అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలు అధికమయ్యాయి' - kadapa news updates
కడపలో అఖిల పక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలు అధికమయ్యాయని ఆరోపించారు.
కడపలో రౌండ్ టేబుల్ మీటింగ్