ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణాలు తొలగించాల్సిందే! - Road extensions news in Yerraguntla kadapa

కడప జిల్లా ఎర్రగుంట్ల నగరపంచాయతీలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణలను తొలగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆక్రమణదారులకు విజ్ఞప్తి చేశారు.

రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణాలు తొలగించాల్సిందే!
రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణాలు తొలగించాల్సిందే!

By

Published : Jan 22, 2021, 4:10 PM IST

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో 120 అడుగుల వెడల్పుతో రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తారని అందుకు తగ్గట్లు ఆక్రమణలను తొలగించుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఈ మార్కింగ్ లోపల స్థలంలో నిజమైన పట్టాదారు ఉంటే వారికి చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తారన్నారు. అలాకాకుండా ఆక్రమించుకున్న వారు తమ సొంత ఖర్చులతో తొలగించుకోవాలని కోరారు. పట్టణ అభివృద్ధికి రోడ్లు చాలా అవసరమన్నారు. ముఖ్యంగా ఎర్రగుంట్ల నగర పట్టణానికి బైపాస్ రోడ్డు కూడా లేదని అందువల్ల జాతీయ రహదారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఇందుకు గ్రామ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details