ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు - కడప ఆర్టీసీ గ్యారేజ్​లో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు

రహదారి భద్రతా వారోత్సవాల ముగింపును కడపలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

road safety awareness program
కడప ఆర్టీసీ గ్యారేజ్​లో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు

By

Published : Jan 28, 2020, 10:00 AM IST

రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం
31వ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం కడప ఆర్టీసీ గ్యారజ్​లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓఎస్​డీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీపై ఇప్పటికీ ప్రజలకు నమ్మకముందన్నారు. చాలా మంది డ్రైవర్లు సెల్​ఫోన్​ మాట్లాడుతూ, బస్సులు నడుపుతున్నారనీ... ఇది పెద్ద తప్పిదమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రమాదాల వల్ల 600 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదాలు నివారిస్తే ఆర్టీసీ మరింత ముందుకు వెళ్తుందన్నారు. విధుల్లోకి చేరి ఒక్క రోడ్డు ప్రమాదం చేయకుండా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లను మెచ్చుకుంటూ, బహుమతులు అందజేశారు. వీరిని మిగతా డ్రైవర్లు ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details