కడప జిల్లా మైలవరం జలాశయం వద్ద ఆనకట్ట పై నుంచి ఉన్న రోడ్డు మార్గం భయంకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు అనేకచోట్ల శిథిలమయ్యాయి. విద్యుత్ సరఫరా లేని స్తంభాలు ఆనకట్ట పొడవునా దర్శనమిస్తున్నాయి. కట్టపైన రోడ్డు లేక పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. రక్షణ గోడలు సంబంధించిన రాళ్లు బయటపడడంతో పరిస్థితి దయనీయంగా మారింది. గండికోట జలాశయం నుంచి కృష్ణా జలాలు చేరడంతో మైలవరం డాం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 6 టీఎంసీల చేరువులో ఉంది. సుమారు 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం దుస్థితి అంతా ఇంతా కాదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి డ్యామ్ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.
అందమైన జలాశయం... చేరుకోవాలంటే మాత్రం కష్టం... - కడప జిల్లా మైలవరం జలాశయం
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ పొంగిపొర్లుతున్నాయి... ఆ అందాలను చూడటానికి పర్యటకులు ఆనందంగా తరలివస్తున్నారు. ఇదే క్రమంలో కడపజిల్లా మైలవరం గ్రామం వద్ద పెన్నానది వరద నీటితో జలకళ సంతరించుకుంది. ఎన్నో ఏళ్ల తరువాత ఇక్కడ నది నిండటంతో దూరప్రాంతాలనుంచి పర్యాటకులు వస్తున్నారు కానీ....రహదారి పరిస్థితి చూసి నిరాశచెందుతున్నారు...ఎందుకో తెలుసుకుందాం!
మైలవరం జలాశయం