ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి - రోడ్డు ప్రమాదాల తాజా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కృష్టా జిల్లాలో లారీ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

road accidents
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు

By

Published : Jan 12, 2021, 7:00 PM IST

కృష్టా జిల్లాలో..

జి.కొండూరు మండలం కుంటముక్కల క్రాస్​ రోడ్డు వద్ద లారీ బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రామచంద్రాపురం గ్రామానికి చెందిన అడ్డాల రామకృష్ణగా గుర్తించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ఉదయం ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్నాయి. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సంపేట సమీపంలో జాతీయ రహదారిపైకి ఎక్కుతుండగా.. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ వెనుకనుంచి బస్సును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు వెనుక భాగం దెబ్బతింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

కడప జిల్లాలో..

కడప జిల్లా బద్వేలు మండలం శివరామ్​నగర్​ వద్ద రెండు ఆటోలు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ప్రత్యేక వాహనంలో బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బద్వేలు మండలం చుట్టు పక్కన గ్రామాల ప్రజలు ఆటోలో వచ్చి.. సంక్రాంతి పండుగకు సరుకులు తీసుకుని గ్రామాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి:మైనర్​పై సామూహిక అత్యాచారం- పట్టాలపై మృతదేహం

ABOUT THE AUTHOR

...view details