కడప జిల్లా ఉప్పరపల్లె శివారులో రోడ్డు ప్రమాదం
కడప జిల్లా ఉప్పరపల్లె శివారులో రోడ్డు ప్రమాదం - కడప జిల్లా ఉప్పరపల్లె శివారులో రోడ్డు ప్రమాదం
కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పరపల్లె శివారులో స్కార్పియో-లారీ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో స్కార్పియో డ్రైవర్ బండి ఆది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. సుల్తాన్(28), హరినాథ్ రెడ్డి(36), నందకిశోర్‌రెడ్డి(6), పార్వతి(30), శంకర్‌నారాయణరెడ్డి(55), జయమ్మ(55), కృష్ణ కిశోర్‌రెడ్డి(29), మరో బాలికకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్కార్పియోలో కర్నూలు జిల్లా బాలంపురం నుంచి తిరుమలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.
![కడప జిల్లా ఉప్పరపల్లె శివారులో రోడ్డు ప్రమాదం Road Accident placed in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6389253-596-6389253-1584057973930.jpg)
కడప జిల్లా ఉప్పరపల్లె శివారులో రోడ్డు ప్రమాదం