ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Need help: ప్రాణాపాయ స్థితిలో కుమారుడు.. దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు - క‌డ‌ప జిల్లా వార్తలు

patient parents need help in Kadapa: వారిది రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. రోజంతా పని చేస్తేనే పూట గడిచేది. అలాంటి కుటుంబాన్ని ఓ రోడ్డు ప్రమాదం ఇబ్బందుల్లోకి నెట్టింది. చేతికొచ్చిన కుమారుడు కోమాలో ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వైద్యం కోసం రూ.20లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Need help
Need help

By

Published : Feb 12, 2022, 3:03 PM IST

patient parents need help in Kadapa: క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు హనుమాన్ న‌గ‌ర్‌కు చెందిన సులోచన, రామకృష్ణ దంపతులు మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ యత్నాల్లో ఉన్నాడు. రెండో కుమారుడు శేఖర్ ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. లక్ష్మీనారాయణ మూడు వారాల క్రితం మిత్రుడితో కలిసి తిరుపతి వెళ్తూ.. ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో మొదట కడపలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పడంతో హైదరాబాద్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని వారాలుగా కోమాలోనే ఉన్న కుమారుడిని చూసి త‌ల్లిదండ్రులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు. కోమాలో ఉన్న తమ కుమారుడికి దాతలు సాయం చేసి.. ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు.

దాతల కోసం లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల ఎదురుచూపు

వైద్యులు రూ.20 ల‌క్షలు అవసరమన్నారు..
వైద్యం కోసం రోజుకు రూ.30 వేల వ‌ర‌కూ ఖర్చువుతోందని లక్ష్మీనారాయణ త‌ల్లిదండ్రులు తెలిపారు. బంధువుల వద్ద అప్పులు తెచ్చి ఇప్పటికే రూ. 8 లక్షలు ఖర్చు పెట్టామని తెలిపారు. వైద్యులు రూ. 20 ల‌క్షల వరకూ అవసరమని చెప్పడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉందని వాపోయారు. దాతలెవరైనా ఆదుకుని తమ కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నారు.

లక్ష్మీనారాయణ డిగ్రీ చదివిన కళాశాల 10 వేల సాయం..
లక్ష్మీనారాయణ డిగ్రీ చదివిన శ్రీవేదవ్యాస కళాశాల యాజమాన్యం.. విద్యార్థుల నుంచి 10 వేల రూపాయలు పోగు చేసి విద్యార్థి తల్లికి అందించామని కళాశాల కరస్పాండెంట్‌ నాగేశ్వర‌రెడ్డి తెలిపారు. లక్ష్మీనారాయణ మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.

లక్ష్మీనారాయణ వైద్యం కోసం రోజుకు 30 వేల రూపాయ‌ల వ‌ర‌కూ ఖర్చువుతోంది. బంధువుల వద్ద అప్పులు తెచ్చి ఇప్పటికే రూ.8 లక్షలు ఖర్చు పెట్టాం. వైద్యులు రూ. 20 ల‌క్షల వరకూ అవసరమని చెప్పడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. దాతలెవరైనా ఆదుకుని మా కుమారుడిని బతికించాలి. - సులోచన, లక్ష్మీనారాయణ తల్లి

ఇదీ చదవండి:విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు: నారా లోకేశ్‌

ABOUT THE AUTHOR

...view details