డివైడర్ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరి మృతి - Road accident on Koppaka National Highway news
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొప్పాక జాతీయరహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వస్తుండగా వీరి వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా..మరొకరు విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు కోడూరు మండలం గొల్లపేటకి చెందిన పల్లా గోపాలకృష్ణ, పల్లా లక్ష్మణరావుగా గుర్తించారు. అనకాపల్లి గ్రామీణ ఎస్సై రామకృష్ణారావు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.