కడప జిల్లా మైలవరంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ.. జమ్మలమడుగు-ముద్దనూరు వద్ద ఘాట్ దిగుతున్న సమయంలో గేర్ రాడ్ ఊడిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి రైల్వే గేట్లను ధ్వంసం చేసుకుంటూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు మరో గదిలో నిద్రిస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఓబులేసు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
బీభత్సం సృష్టించిన లారీ... డ్రైవర్ మృతి - కడప లో రోడ్డు ప్రమాదం
కడప జిల్లా ముద్దనూరు గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. మార్గమధ్యంలో గేర్ రాడ్ ఊడిపోవటంతో సమీపంలోని రైల్వే గేట్లను ధ్వంసం చేసుకుంటూ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
![బీభత్సం సృష్టించిన లారీ... డ్రైవర్ మృతి బీభత్సం సృష్టించిన లారీ...డ్రైవర్ మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9522724-843-9522724-1605175908130.jpg)
బీభత్సం సృష్టించిన లారీ...డ్రైవర్ మృతి
బీభత్సం సృష్టించిన లారీ...డ్రైవర్ మృతి