విశాఖ అనకాపల్లి డైట్ కళాశాల ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అనకాపల్లి జలగలమదం కూడలి వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న రాజశేఖర్ మృతి చెందాడు. జనార్దన్ అనే మరో విద్యార్థికి గాయాలయ్యాయి. మృతుడు మాడుగుల మండలం ముకుందపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు రాజశేఖర్గా గుర్తించారు. మరికొన్ని నెలల్లో చదువు పూర్తి చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడు అనుకున్న కొడుకు ప్రమాదంలో చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది.
లారీ ఢీ కొని ఆరు సంవత్సరాల చిన్నారి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సమీపంలోని చిన్నటేకురు వద్ద ఆరు సంవత్సరాల నందిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా లారీ వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.