కడప జిల్లా వీరపనాయునిపల్లి మండలం అయ్యవారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుల్ని కడప రిమ్స్ కు తరలించారు. మృతులను కడప జిల్లా వేంపల్లి మండలం గరుగువీధికి చెందిన షేక్ పీర్ భాష, వీరపనాయునిపల్లి మండలం అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన ఇందుకూరు అంజిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణాలు తీసిన అతివేగం.. ఇద్దరు మృతి - road accident
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యవారిపల్లి వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
కడప జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు