కడప జిల్లా పెనగలూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను..ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం పెనగలూరు మండలం ఊటిమార్పురం పంచాయతీ నాయుడువారిపల్లి వద్ద ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు యువకులు జలకు రమణ(35), నిమ్మల సుధాకర్(33), నిమ్మల నరసింహులు (16) మృతి చెందారు. వారిలో నిమ్మల సుధాకర్, నిమ్మల నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా జలకు రమణ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పరామర్శించారు.
accident : కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి - road accident in kadapa district
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్లు శ్రీనివాసులు పరామర్శించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం