ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
కడప జిల్లా కాశినాయన మండలం వరికుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
కడప జిల్లా వరికుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు... రాంబాబు గత ఆరు నెలలుగా జ్యోతి క్షేత్రంలో ఉంటున్నాడు. అతను గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఈక్రమంలో పని నిమిత్తం రాంబాబు పోరుమామిళ్లకు వెళ్లి వస్తుండగా వరికుంట్ల వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో రాంబాబు అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.