కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రైల్వే కోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లి వద్ద చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బొగ్గు లోడ్ లారీ.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులు ఇద్దరు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్(24), హరికృష్ణ (32)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రెండు లారీలు ఢీ.. ఇద్దరి మృతి - railway koduru lo road pramadham
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బొగ్గు లోడ్ లారీ.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఉప్పరపల్లిలో రోడ్డు ప్రమాదం