ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో నుంచి జారి పడి బాలుడు మృతి - road accident at hukumpeta

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు తండ్రి కళ్లెదుటే మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ మన్యంలో జరిగింది. పుత్రుడు మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

road accident at hukumpeta visakhapatnam district
ఆటో నుంచి జారి పడి కళ్లెదుటే కుమారుడు మృతి

By

Published : Dec 29, 2020, 7:04 PM IST

విశాఖ జిల్లా హుకుంపేట మండలం సంతారి పంచాయతీ బూరుగుపుట్టు గ్రామంలో సురేంద్రకుమార్ అనే బాలుడు ఆటో నుంచి జారిపడి మృతి చెందాడు. బాలుడి తండ్రి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆటోలో తండ్రి పక్కన సరదాగా కూర్చున్న అతను మూలమలుపు వద్ద జారిపడి మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెరిగిన పుత్రుడు తండ్రి కళ్లెదుటే క్షణాల్లోనే చనిపోవడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details