Road accident : వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడప - తాడిపత్రి ప్రధాన రహదారిపై చెన్నారెడ్డిపల్లె వద్ద ఆటోను లారీ వేగంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ముద్దనూరు సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చెందిన దంపతులు దస్తగిరి, సరస్వతి అనారోగ్యంతో వైద్యం కోసం ఆటోలో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చెన్నారెడ్డిపల్లె వద్ద.. తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ ప్రేమ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. సీఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - accident at chennareddypalle
Road accident : వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలోని చెన్నారెడ్డిపల్లె వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మృతుల్లో దంపతులు, ఆటో డ్రైవరు ఉన్నారు. వీరంతా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదం