ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్, ఆటో ఢీ.. యువకుడు మృతి - road accident at kadapa

కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట సమీపంలో ఆటో, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు.

road accident at chakram peta
ట్రాక్టర్, ఆటో ఢీ.. యువకుడి మృతి

By

Published : May 23, 2020, 5:26 PM IST

కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట సమీపంలో ట్రాక్టర్ ను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముద్రపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నవీన్ (30) మృతి చెందాడు. నిన్న రాత్రి చక్రంపేట మీదుగా ముద్రపల్లిలోని తన ఇంటికి నవీన్ ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న ఏఎస్సై మల్లికార్జన్, స్థానిక పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details