రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి - రోడ్డు ప్రమాదం
కడప జిల్లా రాజంపేట పట్టణంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మనోహర్ మృతిచెందారు.
ACCI
కడప జిల్లా రాజంపేట శివారులోని వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న మనోహర్ పై కారు వేగంగా దూసుకొచ్చింది. తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి మనోహర్ ని తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోహర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.