కడప జిల్లా బద్వేల్ మండలం తొట్టిగారి పల్లి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో బద్వేల్లోని భావనారాయణ నగర్‌కు చెందిన వెంకటసుబ్బయ్య మృతిచెందారు. మైదుకూరు నుంచి బద్వేల్కి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టగా వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు..
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం
కడప జిల్లా బద్వేల్ మండలం తొట్టిగారి పల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి