కడప జిల్లా, వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2020 - 21 ఏడాదికి సంబంధించి ఆర్జేయుకేటీ అడ్మిషన్లు పక్రియను క్యాంపస్ అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను ఈ నెల 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భోజనం, వసతి సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొదటి సారిగా చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి చెప్పారు. ఈ నెల 4 నుంచి 8 వరకు ఓసీ, జనరల్ కేటగిరి క్రింద అడ్మిషన్లు పక్రియను చేపట్టనున్నామని వెల్లడించారు. అలాగే 9 నుంచి 11 వరకు రిజర్వేషన్ కేటగిరి అడ్మిషన్లు ప్రక్రియను నిర్వహించనున్నామని అన్నారు. కౌన్సెలింగ్ జరిగే అన్ని రోజుల్లోనూ.. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ.. తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
' ప్రశాంతంగా ఆర్జేయుకేటీ అడ్మిషన్ల పక్రియ' - కడప వార్తలు
కడప జిల్లా, వేంపల్లె మండంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన ఆర్జేయుకేటీ అడ్మిషన్ల పక్రియకు విద్యార్థులు తరలి వచ్చారు. మొదటి సారిగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు.

'ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్జేయుకేటి అడ్మిషన్లు పక్రియ'
Last Updated : Jan 4, 2021, 7:51 PM IST