ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోట జలాశయంలో పెరిగిన నీటిమట్టం - గండికోట జలాశయంలో పెరిగిన నీటి మట్టం-ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు

కడప జిల్లా గండికోట జలాశయం పరిధిలోని ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. జలాశయంలో నీటిమట్టం పెరగడంతో తాళ్ల పొద్దుటూరు వాసులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

Rising water level in Gandikota reservoir-Villagers evacuating houses
గండికోట జలాశయంలో పెరిగిన నీటి మట్టం-ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు

By

Published : Sep 19, 2020, 3:46 PM IST

కడప జిల్లా గండికోట జలాశయం పరిధిలోని ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. జలాశయం పరిధిలోని తాళ్ల పొద్దుటూరు గ్రామం బీసీ కాలనీలో నీళ్లు చేరుతున్నాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు . గండికోట జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 13.3 టీఎంసీలకు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. నీటిమట్టం పెరగడంతో కాలనీవాసులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. పరిహారం సొమ్ము అందనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details