రాయచోటిని జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ చేపట్టిన రిలే నిరహారదీక్షలు 44వ రోజుకు చేరుకున్నాయి. మైనార్టీలు, ఇతర యవకులు దీక్షలో పాల్గొన్నారు. రాజంపేట, రైల్వేకోడూరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు రాయచోటి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని వెలిగల్లు ప్రాజెక్టు, రొల్లమడుగు ప్రాంతాల నుంచి తాగు నీటి సౌకర్యం ఉండటంతో సరిపడా నీరు అందుతుందని దీక్షలో పాల్గొన్న వక్తలు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు.
44వ రోజుకు చేరిన రిలే నిరహార దీక్షలు - కడప జిల్లా వార్తలు
రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరహారదీక్షలు 44వ రోజుకు చేరుకున్నాయి. తాగునీటి సమస్య లేకపోవటం, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలు ఉండటంతో రాయచోటిని జిల్లా కేంద్రం చేయాలని వక్తలు డిమాండ్ చేశారు.

44 వ రోజుకు చేరిన రిలే నిరహార దీక్షలు