కడప జిల్లా చాపాడు మండలం ద్వారకానగరం వద్ద బయో ఫెర్టిలైజర్స్ తయారీ కేంద్రంపై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ ఎరువులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు కేంద్రానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. కేంద్రంలో నిల్వ చేసిన బస్తాలను పరిశీలించి, ఒక ప్రముఖ కంపెనీకి చెందిన ఎరువుల బస్తాలు అక్కడ నిల్వ ఉండటాన్ని అధికారులు గమనించారు. సోమవారం పొద్దు పోయే వరకు తనిఖీలు చేసిన అధికారులు మీడియాకు స్పష్టత ఇవ్వలేదు. ఈ మేరకు మంగళవారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి నివేదికనిస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు.
బయో ఫెర్టిలైజర్స్ తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారుల దాడులు - కడపలో బయో ఫెర్టిలైజర్ ఎరువుల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు
కడప జిల్లా చాపాడు మండలం ద్వారకానగరంలోని బయో ఫెర్టిలైజర్స్ తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సోమవారం పొద్దు పోయే వరకు తనిఖీ చేసిన అధికారులు మీడియాకు ఎలాంటి స్పష్టతనివ్వకపోగా... మంగళవారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి నివేదికనిస్తామని పేర్కొన్నారు.
బయో ఫెర్టిలైజర్ ఎరువుల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు