ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాలి' - కమలాపురంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డి సూచించారు. కడప జిల్లా కమలాపురం ఎంపీడీవో కార్యాలయంలో వైరస్​ కట్టడిపై సమీక్ష నిర్వహించారు.

Review of MLA Rabindranath Reddy on Corona Cutting
కరోనా కట్టడిపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ​రెడ్డి సమీక్ష

By

Published : Apr 13, 2020, 1:15 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డి అధికారులకు సూచించారు. కడప జిల్లా కమలాపురం ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కట్టడిపై సమీక్షించిన ఆయన.. పోలీసు, వైద్య సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రతి మండలంలో హైపో ద్రావణాన్ని పిచికారి చేయించాలని చెప్పారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details