ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించొద్దన్న ఈసీ ఆదేశాలు ఉన్నందున కడపజిల్లా రాజంపేటలోని థియేటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఎన్ఎస్ఆర్ థియేటర్లో సినిమాను ప్రదర్శించారన్న ఆరోపణలతో ఆర్వో నాగన్న తనిఖీలు చేశారు. సినిమా ప్రదర్శనపై ఆరోపణలు వచ్చిన విశ్వనాథ్‌రెడ్డిని విచారించారు. ఏప్రిల్ 30న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరిగిందని... ఆంక్షలు సడలించనందున ప్రదర్శన చేయలేదని ఆయన వివరణ ఇచ్చచారు.
ఎన్ఎస్ఆర్ థియేటర్లో ఆర్వో తనిఖీలు - laxmi's ntr
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ థియేటర్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో... ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగన్న తనిఖీ చేశారు.
ఎన్ఎస్ఆర్ థియేటర్లో ఆర్వో తనిఖీలు