విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలి: విశ్రాంత జస్టిస్ గోపాలగౌడ్ - kadapa district
కడప జిల్లా రాయచోటిలో స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యారు.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ్. అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు.
![విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలి: విశ్రాంత జస్టిస్ గోపాలగౌడ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4144750-283-4144750-1565880137713.jpg)
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్ళు గడిచినా.. దేశంలో పేదరికం తగ్గలేదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాయచోటిలోని ఓ విద్యాసంస్థల్లో స్వాతంత్ర వేడుకలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు దేశం గర్వించేలా క్రమశిక్షణతో ఎదగాలని కోరారు. అనంతరం రాయచోటి పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు సుధా, శ్రీనివాసులు తాసిల్దార్లు, విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.