రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని, రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్ అయి ఉండొచ్చునని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. ఎరికల్ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు భిన్నంగా తాజా శాసనాలు సూచిస్తున్నాయని పరిశోధక విద్యార్థి నాగదాసరి మునికుమార్ తెలిపారు.
కడప జిల్లా సిద్దవటం శివారులోని లంకమల అభయారణ్యంలోని ఇష్టకామేశ్వర నిత్యపూజస్వామి కోవెల పరిసరాల్లో లభ్యమైన శిలాశాసనాలను ఎపీగ్రఫీ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ఇటీవల అధ్యయనం చేశారు. ఆ వివరాలను కడప నివాసి మునికుమార్ ఇక్కడ వివరించారు. ఆయన బెంగళూరులోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళా కేంద్రంలో తాళపత్ర లిపిశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. 1500 ఏళ్ల కిందట వెలసిన నిత్యపూజకోన చరిత్రను అధ్యయనం చేస్తూ రెండేళ్ల క్రితం సమీపంలోని పంచలింగాల గుడి పక్కన ఉన్న కొండపై నాలుగు పురాతన శాసనాలను గుర్తించారు. వీటిని మైసూరులోని భారత పురావస్తు శాఖ ఏపీగ్రఫీ అధికారులు తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు.
ఇదీ చరిత్ర