కడప జిల్లా రాజంపేట మండలం అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువ కింద చివరి ఆయకట్టు చెరువులకు నీరు అందడం లేదంటూ అన్నదాతల ఆందోళనపై గత నెల ఒకటో తేదీన ఈటీవీ భారత్లో 'అందని నీళ్లు' అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై అధికారులు స్పందించి కాలువలోని అడ్డంకులను తొలగించారు. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు అందడానికి మార్గం సుగమమైంది. తమ సమస్యను వెలుగులోకి తెచ్చి, పరిష్కారానికి కృషి చేసిన ఈటీవీ భారత్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రైతన్నల సమస్యలు పరిష్కరించిన అధికారులు - annamayya project
కడప జిల్లాలో ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. అన్నమయ్య ప్రధాన కాలువ చివరి ఆయకట్టు రైతుల సమస్యలపై గత నెల ఒకటో తేదీన ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.
అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువలో అడ్డంకుల తొలగింపు